Tuesday, 3 November 2026

నాంపల్లి కోర్టుకు హాజరైన సబిత ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): దాల్మియా సిమెంట్స్‌ కేసులో హోం శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన వారు కూడా కోర్టుకు వచ్చారు. సబిత దాఖలు చేసిన వ్యక్తిగత బాండును కోర్టు ఆమోదించింది. జ్యూడిషియల్‌ రిమాండ్‌ కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమోపై దీని ప్రభావం ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
సాక్ష్యాధారాల్ని ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలపై మాజీ మంత్రులు సబిత , ధర్మాన ప్రసాదరావును జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపించాలని సీబీఐ కోర్టుకు కోరింది. రెండు రోజుల క్రితం దీనిపై ఇరుపక్షాల వాదనల్ని కోర్టు విని తీర్పును ఈ నెల 25న కోర్టు వెలువరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *