Monday, 2 November 2026

నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌ : ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌ (ఒఎంసి) కేసులో నిందితురాలుగా ఉన్న ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఆమెకు న్యాయస్థానం ఈనెల 25 వరకూ రిమాండ్‌ విధించింది. అనంతరం శ్రీలక్ష్మిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
మరోవైపు ఆమె మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై నిర్ణయాన్ని సీబీఐ ప్రత్యేక ప్రిన్సిపల్‌ కోర్టు మార్చి 25కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉందని, బెయిల్‌ను తక్షణమే రద్ధు చేయాల్సిందిగా సబీఐ కోర్టు విజ్ఞప్తి చేయగా, దీనిపై స్పందించిన కోర్టు ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది. నివేదిక అందాక 25న తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *