మినీ ట్యాంక్‌బండ్‌తో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించా: మర్రి
నాగర్‌కర్నూలు,అక్టోబర్19(జనంసాక్షి): సీఎం కేసీఆర్ హయాంలో నాగర్ కర్నూల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లానని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల్లోనూ గెలిచి మరింత అభివృద్ధి చేస్తానని హావిూ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నాగర్ కర్నూల్ పట్ణణం అభివృద్ధి పథంలో దూసుకెళుతోందన్నారు. నాగర్ కర్నూల్ పట్టణానికే తలమానికమైన కేసరి సముద్రం చెరువును బాగుచేయడంతో పాటు రూ.20 కోట్ల నిధులతో మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దారు. హైదరాబాద్ తరహాలోనే చెరువు మధ్యలో బుద్ధుడి విగ్రహాన్ని నెలకొల్పారు. బోటింగ్ సదుపాయం కూడా కల్పించారు. సందర్శకుల కోసం నర్సరీ, ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. చిన్న పార్క్, పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దసరా పండుగ సందర్భంగా.. ప్రజలు పెద్దెత్తున మినీ ట్యాంక్ బండ్ కు తరలివచ్చి.. ఉత్సాహంగా గడిపారు. 2 వేల ఎకరాల విస్తీర్ణంలోని కేసరి సముద్రం చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారని చెప్పారు. ప్రజలు ట్యాంక్ బండ్ వద్ద ఉత్సాహంగా గడపడం చూస్తుంటే సంతోషంగా ఉందని మర్రి జనార్ధన్ రెడ్డి చెప్పారు.మినీ ట్యాంక్ బండ్ ను చూసిన ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిల కృషి వల్లే నాగర్ కర్నూల్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందన్నారు.మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి రావడంపై ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి మినీ ట్యాంక్ బండ్ టూరిస్ట్ స్పాట్‌గా మారిందని సంతోషం వ్యక్తం చేశారు.
నాగర్ కర్నూల్‌ను మరింత అభివృద్ది చేస్తా




