నాగెళ్లి లక్ష్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మండల సర్పంచులు
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 11:
మండలంలోని లంబాడిపల్లి గ్రామ సర్పంచ్ నాగేళ్ళి వకులాదేవి అత్తమ్మ,సీపీఐ మండల కార్యదర్శి నాగేళ్లి లక్ష్మారెడ్డి మాతృమూర్తి నాగెళ్ళీ ఈశ్వరమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోగా ఆదివారం మండల సర్పంచులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.వారి స్వగృహంలో ఈశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈశ్వరమ్మ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం అని బాధను వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో చిగురుమామిడి సర్పంచ్ బెజ్జెంకి లక్ష్మణ్, రెకొండ సర్పంచ్ పిట్టల రజిత/శ్రీనివాస్ చిన్నముల్కనూర్ సర్పంచ్ ముప్పిడి వెంకటరమణా రెడ్డి , గాగిరెడ్డిపల్లి సర్పంచ్ సన్నిల్ల వెంకటేష్, ఓగులాపూర్ సర్పంచ్ బోయిని శ్రీనివాస్,పీచుపల్లి సర్పంచ్ పీచు లీల/సత్యనారాయణరెడ్డి, ఉల్లంపల్లి సర్పంచ్ చెప్యాల మమత/శ్రీనివాస్, కొండాపూర్ సర్పంచ్ పెద్దపల్లి భవాని/అరుణ్ కుమార్ లు పాల్గొన్నారు.