ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
కడెం సెప్టెంబర్ 11( జనం సాక్షి) కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి ఎగువన కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు నిండుకుండలా మారింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు యొక్క నీటి మట్టం 694. 625 అడుగుల గా ఉంది ఎగువ నుండి 65 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అధికారులు 8 వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు