మెగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ భూములపై ఎంపీ పాటిల్ వివరణ
హైదరాబాద్,సెప్టెంబర్1(జనంసాక్షి): మెగా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో తనకు వాటా లేదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం చేశారు. రైతుల నుంచి కొన్న 700 ఎకరాల భూములు కంపెనీ పేరు విూదనే ఉన్నాయని తేల్చి చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లో తన నివాసంలో విూడియాతో మాట్లాడుతూ జహీరాబాద్ లో రైతుల నుంచి కొన్న 700 ఎకరాల భూములు కంపెనీ పేరు విూదనే ఉన్నాయన్నారు. కంపెనీ కొన్న భూముల విషయంలో తనపై జరుగుతున్న దుష్పచ్రారాన్ని ఆయన ఖండించారు. సదురు కంపెనీ తమ సిస్టర్ కంపెనీ అని చెప్పారు. తనతో ఎవరికీ వ్యాపార సంబంధాలు, వాటాలు లేవని తెలిపారు. ఇక తమ భూమికి తక్కువ ధర వచ్చిందని రైతులెవరైనా తన దగ్గరికి వస్తే నష్టపరిహారం ఇప్పిస్తానని పాటిల్ తెలిపారు. తహసీల్దార్ ద్వారా పరిశీలించిన తర్వాతే భూములు కొనుగోలు చేశారని చెప్పారు. ఆ కంపెనీ భూములు ఎలా కొన్నారో తనకు తెలియదని, అక్కడ కంపెనీ వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మాత్రమే చూశానని పాటిల్ వివరించారు.
బీజేపీ చేరేది లేదు
తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ విషయంపై ఎవరితో మాట్లాడలేదని తేల్చి చెప్పారు.
—————–




