హైదరాబాద్,మే11(జనం సాక్షి ): నారాయణగూడలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నారాయణగూడకు చెందిన మనోజ్‌కుమార్ చీరల వ్యాపారం చేస్తున్నాడు. ఈ ఆదాయం సరిపోకపోవడంతో రెండు సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. స్ట్రీట్ నెం.12లోని డ్యూడ్రాప్స్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో 35 మంది పంటర్లతో బెట్టింగ్ దందా నడిపిస్తున్నాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన బెట్టింగ్‌ల నగదును వసూలు చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు బుకీ మనోజ్‌కుమార్‌తో పాటు పంటర్ విశాల్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.80వేల నగదుతో పాటు టీవీ, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.




