Thursday, 5 November 2026

విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సిఎస్‌ల భేటీ

హైదరాబాద్‌,మే11(జ‌నం సాక్షి ): బేగంపేటలోని మెట్రో రైల్‌ భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, దినేష్‌ కుమార్‌లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై చర్చించారు. సంస్థల విభజన, ఉద్యోగుల బదలాయింపు, ఆర్థిక పరమైన అంశాలతో పాటు 9, 10 షెడ్యూల్స్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఏపీ విభజన అంశాల ముఖ్య కార్యదర్శి ప్రేమ్‌ చంద్రారెడ్డి హాజరయ్యారు.
ఈ సమావేశంలో విభజనాంశాలు చర్చకు రానుండడంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన, భవనాల అప్పగింతకు సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉన్నది.