నారా భువనేశ్వరి ని కలిసిన బూర్గంపహాడ్ మండల టిడిపి, టిఎన్ టి యు సి

నారా భువనేశ్వరి ని కలిసిన బూర్గంపహాడ్ మండల టిడిపి, టిఎన్ టి యు సి

బూర్గుంపహాడ్ అక్టోబర్ 18 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండల టి డి పి, టి ఎన్ టి యు సి నాయకులు మాజీ ముఖ్యమంత్రి టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ని రాజమండ్రిలో కలిశారు. మండల టిడిపి అధ్యక్షులు తాళ్లూరు జగదీశ్వరరావు, ఐ టి సి టి ఎన్ టి యు సి అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్, చైర్మన్ గల్లా నాగభూషయ్య టిడిపి నాయకులు కాకర్ల సత్యనారాయణ, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ టి ఎన్ టి యు సి నాయకులకు కూరపాటి శ్రీనివాసరావు కలిసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబునాయుడు అరెస్టు తమను ఎంతో బాధిస్తుందని, ఆయన త్వరలోనే కడిగిన ముత్యం లా బయటికి వస్తారని ఆకాంక్షిస్తున్నామని భువనేశ్వరి కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పోలీస్ బ్యూరో సభ్యులు భక్కిని నరసింహులు, రాష్ట్ర నాయకులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు