జనంసాక్షి.. జహీరాబాద్ మండలంలోని కొత్తూరు (బి) గ్రామ సమీపంలో గల నారింజ ప్రాజెక్టును బుదవారం జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్రావు పరిశీలించారు. గత ఆరు రోజులుగా కురుస్తున్న వర్షానికి నారింజలోకి వస్తున్న వరద నీటి ఉదృతిని, ప్రాజెక్టు నాణ్యతను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రాజెక్టు వద్ద నీటి సామర్థ్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రాజెక్టు వద్ద నీటి ఉధృతిని పరిశీలించి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలన్నారు. అనంతరం జహీరాబాద్ బైపాస్ రహదారి పక్కన గల నారింజలోకి వెళ్లే ప్రధాన కాలువను ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టేంతవరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ప్రజలు నివసించకుండా ఉండేలా చూడాలని ఎమ్మెల్యే మాణిక్రావు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు ఎంజి రాములు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమర్, దిడ్గి గ్రామ సర్పంచ్ కరణ్రాజ్, పెంటారెడ్డి, ఇజ్రాయేల్ బాబీ, మొహమ్మద్ యూనిస్, మచందర్, డేవిడ్, శ్రీకాంత్, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
నారింజ ప్రాజెక్టును పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు




