జులై . (జనంసాక్షి)నారింజ వాగు నీరు తోనే జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంతం అబివృద్ది చెందుతుంది కావున వృధాగా కర్ణాటక కు వెళ్లకుండా ఆపుకుంటే జహీరాబాద్ ప్రాంత సాగు మరియు త్రాగు సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని మొగుడం పల్లి ఆశప్ప అన్నారు. ఇట్టి విషయం లో గత ఐదు సంవత్సరాల నుండి ఈ నీటి సమస్య పరిష్కరించడం కోసం వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ వృధాగా వెళుతున్నటువంటి నీటిని ఆప్తే జహీరాబాద్ సమస్య పరిష్కారం దొరుకుతది అని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం నుండి అధికారులు పరిష్కారం కోసం ప్రయత్నం మాత్రం చేయట్లేదు అన్నారు. ఈ సమస్య పరిష్కారం జహీరాబాద్ లో నీటి సకల సమస్యల పరిష్కారం కావున నారింజ వాగు నీటిని జహీరాబాద్ ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు.
నారింజ వాగు నీరు తోనే నియోజకవర్గ అబివృద్ది




