హైదరాబాద్,జూలై28(జనం సాక్షి):తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అద్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం నిర్వహించారు. జనరల్ సెక్రెటరీ ఉ. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు గడిచిన రాష్ట్ర లారీ యజమానులు సమస్యలు పరిష్కారించలేని కారణంగా నిరవధిక లారీ రవాణా బంద్‌కు పిలుపు ఇవ్వటం జరిగిందన్నారు. తక్షణం మా సమస్యలు క్వార్టర్ టాక్స్ తగ్గించాలి ,సింగిల్ పర్మిట్ అమలు చేయాలి,టోల్ టాక్స్ విధానంలో మార్పులు చెయ్యాలి,ఎగుమతి దిగుమతి అక్రమ వసూళ్ళు చేయకుండా లారి యజమానులకు భద్రత కల్పించాలి, లారి పార్కింగ్ స్థలం ఏర్పాటు చెయ్యాలి, లారి యజమానులు / వాహన ధార్లు వద్ద అక్రమ వసూళ్ళు చేస్తున్న రవాణా చెక్ పోస్ట్‌లను వెంటనే తొలగించాలన్నారు. జి. ఎస్.టి లోకి డీజిల్ చేర్చాలి,థార్డ్ పార్టీ పెంచిన ఇన్సూరెన్స్ ను వెంటనే తగ్గించ్చాలి, టోల్ టాక్స్ వద్ద ఖాళీ గా వెళ్ళు లారిలకు 50శాతం మాత్రం ని వసూళ్ళు చెయ్యాలి అని అన్నారు. ఈ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పరిష్కరించాలని కోరుతూ డిమాండు చేస్తున్నారు.




