మహారాష్ట్ర తరహాలో పోరాటం చేస్తాం
– పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోం
– తేడా వస్తే .. సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం
– కేసులు పెడితే ఎదురు తిరగండి.. విూ వెంట నేనుంటా
– రాజధానికి 1850 ఎకరాలు చాలని బాబు నాతో అన్నారు
– అదీ అటవీ ప్రాంతంలో భూములను సేకరిస్తామన్నారు
– ప్రశ్నించేవారు లేరనుకుంటున్నారా.. తోలు తీస్తాం
– భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్
విజయవాడ, జులై28(జనం సాక్షి) : ప్రభుత్వం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, తేడా వస్తే మహారాష్ట్ర తరహాలో ఉద్యమాన్ని చేపడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2013 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సును శనివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ భేటీలో పవన్‌తో పాటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్లతోపాటు సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు, పలువురు ప్రముఖులు, మేధావులు పాల్గొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన భూసేకరణ బాధితులు కూడా హాజరయ్యారు. సమావేశంలో నేతలు, ప్రముఖులు, మేధావుల అభిప్రాయాలను పవన్ తెలుసుకున్నారు. అలాగే భూ నిర్వాసితుల ఇబ్బందులపై ఆరా తీశారు. సమావేశంలో ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ మండిపడ్డారు. చంద్రబాబు చాలా తప్పు చేస్తున్నారని, సీఎంను నేను కలిసినప్పుడు రాజధాని 1850 ఎకరాల్లో నిర్మిస్తామన్నారని పవన్ తెలిపారు. అది కూడా అటవీ ప్రాంతమనే చర్చకు వచ్చిందన్నారు. ఇప్పుడేమా అది లక్ష ఎకరాలకు చేరిందని, ఏం బాధ్యాతయుతమైన అభివృద్ధిని చేయలేరా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా దోపిడీ చేయడానికి సీఎం సొంత రాజ్యం కాదన్నారు. పర్యావరణం ఎలా నాశనమవుతుందో పశ్చిమగోదావరి జిల్లాను చూస్తే అర్థమవుతుందన్నార. పిచ్చి, పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని, ఏం అడిగేవాళ్లు లేరనుకుంటున్నారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గమనిస్తున్నారని, తోలు తీస్తారు గుర్తు పెట్టుకోండంటూ హెచ్చరించారు. భూదోపిడీపై న్యాయ, రాజకీయ, ప్రజా ఉద్యమాలు చేస్తామన్నారు. మహారాష్ట్ర తరహాలో రైతు ఉద్యమాలు చేసేందుకు సిద్ధమన్నారు. అందరం వచ్చి సీఎం ఇంటి ముందు కూర్చుంటామని, అమరావతిని ఆపేస్తామని, /ూజధానిని అడ్డుకుంటామని పవన్ హెచ్చరించారు. ఒకవేళ కేసులు పెడితే ఎదురు తిరగండి.. అండగా నేను ఉంటానని పవన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం నా విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, శ్రీకాకుళంలో పోలీసు భద్రత ఇవ్వలేదన్నారు. నేను పాదయాత్ర చేస్తుంటే ఏవిూ పట్టనట్లు వ్యవహరించారని, సీఎం ఆదేశాలతోనే పోలీసులు అలా వ్యవహరించారని అనుకుంటున్నానని అన్నారు. నేను ప్రజల్ని కదిలించగలను.. నన్ను ఎవరూ డబ్బుతో కొనలేరని పవన్ పేర్కొన్నారు. చంద్రబాబు రాహుల్‌కు కొన్ను కొట్టి మనమంతా ఒక్కటే అనగలరు. పొత్తులపై ఎన్నికల సమయంలో ఆలోచిస్తానని, ఇప్పుడు ఉద్యమాలేనని పవన్ కళ్యాణ్ అన్నారు. తన సభలకు భద్రత కుదరదని చెప్పే పోలీసులపై తనకెలాంటి వ్యతిరేకతా లేదని, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వారు అలా వ్యవహరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. భీమవరంలో ఇప్పటివరకు చెత్త డంపింగ్ యార్డు లేదన్న పవన్.. బాధ్యతాయుతమైన అభివృద్ధి చేయాలని
అన్నారు. ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమని, పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. కలుషితమైన రాజకీయాలను మార్చడానికే వచ్చానన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కన్నీటి కథలే వినబడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నించేవారిని భయపెడుతున్నారని, తాను ప్రజల పక్షాన నిలబడతానని ప్రభుత్వం ఇష్టారాజ్యాన్ని సాగనివ్వనని పవన్ హెచ్చరించారు.