ధ్వజారోహణతో ప్రారంభించిన స్వామిగౌడ్
హైదరాబాద్,జూలై28(జనం సాక్షి): హరిబౌలి శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి మందిరంలో 70 వ వార్షిక బోనాల ఉత్సవాలను తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ నిరంజన్‌తో కలిసి అట్ట హాసంగా ప్రారంభించారు.. ముందుగా ఆయన ధ్వజారోహణ, కలశ స్థాపన తో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.. అంతకుముందు ఆలయానికి చేరుకున్న స్వామి గౌడకు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు … ఈ సందర్బంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక బోనాల ఉత్సవాలని … ఈ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు నిధులు మంజూరుచేసిందన్నారు.. తానేష దగ్గర మంత్రులుగా కొలువున్న అక్కన్న మాదన్నలు ఈ గుడికి వచ్చి పూజలు చేసి .. ఇక్కడే విడిది గృహంలో బస చేసేవారని .. అప్పటి నుండి అక్కన్న మాదన్న మహంకాళి మందిరంగా ప్రసిద్ధి చెందిందన్నారు… హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వరదలకు అప్పటి నిజాం నవాబు మంత్రుల సూచన మేరకు వరద ఉధృతిని తగ్గించడానికి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద పసుపు, కుంకుమ, చీర , జాకెట్లు, ముత్యాలను సమర్పించారని చెప్పారు. అప్పటి నుంచి ఆ వరదలు తగ్గు ముఖం పట్టాక గాజులు ఆగిన చోట చుడి బజార్‌గా, చీర జాకెట్లు పడ్డ చోటును మదీన బట్టల బజారుగా, ముత్యాలు పడ్డ చోటును దర్బారుగా పేరొందాయని చెప్పారు..




