నాలుగేళ్లలో పనికొచ్చే ఒక్క పనికూడా కవిత చేయలేదు

– బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌
నిజామాబాద్‌, జూన్‌27(జ‌నం సాక్షి) : డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని, మరోవైపు టీఆర్‌ఎస్‌ నుంచి ఆయనపై వేటుకు రంగం సిద్ధమైందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై డీఎస్‌ కుమారుడు, బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌  ఓ విూడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదన్నారు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారని తెలిపారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్కపని కూడా ఆమె చేయలేదన్నారు. ఏదో సెలబ్రిటీగా ఎప్పుడో ఓసారి జిల్లాలో పర్యటించేవారు తప్ప ఆమె నిజామాబాద్‌ జిల్లా కోసం చేసిందేవిూ లేదన్నారు. తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్యకర్తలు స్వయంగా డీఎస్‌కు లేఖలు ఇచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చున్నారు. ఇంటెలిజెన్స్‌ అంతా సాధారణంగా పనిచేస్తుందని, గత మూడు రోజులుగా డీఎస్‌ ఏ కాంగ్రెస్‌ నేతను కలిశారో చెప్పాలని అరవింద్‌ డిమాండ్‌ చేశారు.