జన్నారం : ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం కామన్పల్లి గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై పుష్పాపూర్ గ్రామానికి చెందిన రాజేశ్(29) అనే యువకుడు బుధవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఉన్న బాలికను తల్లిదండ్రులు రాత్రే జన్నారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం వారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వార్త బయటకు వచ్చింది. ఉదయం బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.




