Tuesday, 3 November 2026

ఎలాంటి విచారణకైనా సిద్దం: టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తులపై ఎలీంటి విచారణకైనా సిద్దమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. తమపై విష ప్రచారం చేస్తూ ఉద్యమాన్ని, ఉద్యమ నాయకత్వాన్ని దెబ్బతీయాలనుకోవడం చవకబారు తనమని టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ నేత ఈటెల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. తప్పుడు కథనాలతో తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ కోసం అమరులైన వారి మరణ వాంగ్మూలాలను రేపు బయటపెడతామన్నారు. అందులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పేర్లు ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్దమని చెప్పారు. టీడీపీ నేతల పేర్లు ఉంటే శిక్షకు సిద్దమేనా అని సవాల్‌ విసిరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *