మల్దకల్ ఆగస్టు 2 (జనంసాక్షి) మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాలుగో రోజు మంగళవారం భజన ప్రారంభమైంది.మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సప్తహ భజన కార్యక్రమంలో భాగంగా ఇటిక్యాల మండలం శెనగపల్లి గ్రామానికి చెందిన భజన మండలి బృందం వారు భక్తి పాటలు ఆలపించి వారి భక్తిని తెలిపారు.శ్రావణమాసం సందర్భంగా సప్తా భజన కార్యక్రమంలో నాలుగో రోజు పాల్గొన్న భజన మండలి వారికి దర్శనానికి వచ్చిన భక్తులకు పెద్దొడ్డి గ్రామానికి చెందిన రామకృష్ణ దంపతులు అనే భక్తుడు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.పచ్చర్ల గ్రామానికి చెందిన మాస్టర్ హార్మోనిస్ట్ రాఘవేంద్ర చారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరుగుతుంది.వివిధ గ్రామాల నుండి భజన మండలి భక్తులు తరలివచ్చి స్వామివారి సన్నిధిలో భజన కార్యక్రమంలో పాల్గొని తమ వంతు భక్తి పాటలతో ఆలపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు
నాలుగో రోజు కొనసాగుతున్న సప్తహ భజన




