నిజామాబాద్: నగరంలో అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశామని, వీరిని పార్థి గ్యాంగ్‌గా నిర్ధారించామని నిజామాబాద్ నగర డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ ముఠా నిజామాబాద్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్‌లలో చోరీలకు పాల్పడి.. పెద్దమొత్తంలో బంగారు ఆభరణాలను ఆపహరించుకెళ్లిందని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.




