నిజామాబాద్ జిల్లాలో ఓ బాలికపై కిరోసిన్ పోసి..
నిజామాబాద్: జిల్లాలో సోమవారం దుండగులు దారుణానికి పాల్పడ్డారు. బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో భాగ్యలక్ష్మి 11 సంవత్సరాల బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయాలపాలైన ఆ బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై పోలీసులు స్పందించి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.