నిజాయితీ చాటుకున్న సత్యసాయి భక్తుడు.

పోటో: నగదు అందజేస్తున్న సేని వెంకన్న.
బెల్లంపల్లి, సెప్టెంబర్12,(జనంసాక్షి)
యాభై అయిదు వేల రూపాయల నగదు పోగొట్టుకున్న బాధితురాలికి సత్యసాయి భక్తుడు సేని వెంకన్న అందించి నిజాయితీ చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నందులపల్లి గ్రామానికి చెందిన ఖాతాదారురాలు బ్యాంకు సమీపంలో ₹ 55 వేల రూపాయల నగదు ఉన్న సంచిని పోగొట్టుకుంది. బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగి, సత్యసాయి భక్తుడు వెంకన్నకు ఆ సంచి దొరికింది. సంచి పోగొట్టుకున్న బాధితురాలు సంచి కోసం వెతకగా బ్యాంకు అధికారులు, సిబ్బంది, ఖాతాదారుల సమక్షంలో నగదును అందజేసి నిజాయితీని చాటుకున్నాడు. నిజాయితీ చాటుకున్న వెంకన్నను బ్యాంకు మేనేజర్ రాజారాం, క్యాషియర్ కొమురయ్య, సిబ్బంది, ఖాతాదారులు అభినందించారు.