Friday, 6 November 2026

నితిన్ ఇంట్లో పెళ్లి బాజా!

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ ఇంట్లో పెళ్ళి బాజాలు మోగనున్నాయి. హీరో నితిన్ సోదరి, నిర్మాత నిఖితా రెడ్డి వివాహం హైద్రాబాద్‌లో వైభవంగా జరగనుంది. వరస ప్లాప్ లతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్ సొంత నిర్మాణ సంస్థలో నిఖితా రెడ్డి నిర్మాతగా మారి సరికొత్త పంథాలో నిర్మించిన ఇష్క్ సినిమాతో నితిన్ హిట్ కొట్టాడు. అప్పటి నుండి నితిన్ సెలక్ట్ చేసుకుంటున్న కథలలో నిఖితా రెడ్డి సలహాలను కూడ తీసుకుంటూ వస్తున్నాడు నితిన్. ఇష్క్ తర్వాత ఆ సంస్థ నిర్మించిన వరుస సినిమాలకు నిఖితాయే నిర్మాతగా ఉన్నారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్‌పై ఆ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసే అవకాశాన్ని ఆ సంస్థ పొందింది. నితిన్ సోదరి ఇప్పుడు పెళ్ళికూతురుగా పెళ్ళిపీటలు ఎక్కనున్నది. నిఖితా రెడ్డి.. అఖిలేష్ రెడ్డిని ఈ నెల 15న వివాహమాడనున్నారు. ఇదంతా పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా వేడుకను నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ నుండే కాకుండా, రాజకీయ, వ్యాపార ప్రముఖలు కూడ ఈ పెళ్లిలో హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నితిన్ తండ్రి కూడా ఫిల్మ్ డ్రిస్టిబ్యూటర్ గా వ్యవహరించేవారు. ఈ నేపధ్యంలో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య వైభవంగా వేడుకను నిర్వహించే పనుల్లో నితిన్ బిజిబిజిగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *