ప్రతిష్టాత్మక మిషన్ కాకతీయను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే ఏనుగు రవిందర్ రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో ఎల్లారెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. గత పాలకుల వైఫల్యంతో చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయన్నరు. చెరువుల పునరుద్ధరణతో గ్రామాలు అభివృద్ధి అవుతాయని.. ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్న నీటి సమస్య కూడా తీరుతుందని రవీందర్ రెడ్డి అన్నారు.




