.. జనం సాక్షి న్యూస్ జూలై 21:టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు స్థానిక శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యవసర సరుకులపై జిఎస్టిని పెంచిన సందర్భంగా జీఎస్టీని రద్దు చేయాలనీ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ
ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సహా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరో భారం పడిందని పేద, మధ్య తరగతి వర్గాలపై నిత్యావసర సరుకుల భారం మరింత పెరగనుందన్నారు . ఆహార పదార్థాలపై ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది.ఈ ఆహార పదార్థాలలో పాలు ప్యాక్ చేసిన పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్ ప్యాక్ చేసిన బియ్యం, గోధుమలు, పిండిపై జిఎస్టి విధించారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లు సురకంటి వెంకట్ రెడ్డి చిట్టేటి వెంకట్రాంరెడ్డి మండల టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎమ్మెల్యే లింగ స్వామి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ నోముల మల్లేష్ కొత్త రామ చంద్రు ముద్దసాని కిరణ్ రెడ్డి చెవ్వ వెంకటేశం ఐటి పాముల రవీందర్ కలుకూరి రాములు తదితరులు పాల్గొన్నారు
Attachments area




