నిధుల వినియోగంపై సమాచారం ఇవ్వండి…

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో  ఆర్టిఐ దరఖాస్తు…
అనంతగిరి , జనం సాక్షి
కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై సమగ్ర సమాచారం కోసం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో, ఆ పార్టీ మండల అధ్యక్షులు ఏలేటి వెంకటేశ్వర రెడ్డి, బిజెపి నాయకులు మండల వ్యవసాయ అధికారి అందే సతీష్ కు గురువారం ఆర్టిఏ దరఖాస్తు అందజేశారు. రైతు సంక్షేమ పథకాలకు, రైతు వేదిక నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలను  ఆర్టిఐ ద్వారా తెలియజేయాలని కోరినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ  ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల సతీష్  పాల్గొన్నారు.