ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్.
నారాయణఖేడ్ జులై12(జనంసాక్షి)
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా మండలాల ఎమ్మార్వోలు, విలేజ్ సెక్రటరీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు (సిబ్బంది) ఇతర కార్యక్రమాలను రద్దు చేసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని నారాయణఖేడ్ ఆర్డిఓ అంబాదాసు రాజేశ్వర్ కోరారు.
గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదు అన్నారు. అలాంటివి ఏవైనా ఉంటే గ్రామంలో ఉన్న సర్పంచ్ దృష్టికి కానీ పంచాయతీ సెక్రెటరీ లేదా రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని అన్నారు. అలాంటి ఇండ్లలో ఎవరైనా ఉన్నారని మా దృష్టికి తెస్తే వారిని సురక్షితమైన ఇండ్లలోకి షిఫ్ట్ చేస్తామన్నారు. అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు అలాగే ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లేటప్పుడు మధ్యలో వాగులు వంకలు ఉంటాయి అది జాగ్రత్తగా చూసుకొని మనకు అనుకూలంగా ఉంటేనే ప్రయాణం చేయాలి అన్నారు. లేదంటే మానుకోవాలి మన ప్రాణం కంటే ఏది గొప్ప కాదని అన్నారు. ఈ వర్షాలతో నీరు కంఠాన్మేషన్ జరిగి కలుషితం అయ్యే అవకాశం ఉందని అందువల్ల స్వచ్ఛమైన నీటిని వేడి చేసుకుని చల్లారినంక తాగాలని అన్నారు. మిగతా అన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని నారాయణఖేడ్ ఆర్డీవో అంబాదాసు రాజేశ్వర్ కోరారు.
నియోజకవర్గ అధికారులకు మరియు ప్రజలకు వాతావరణ సూచన.




