హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కికణ్ సర్కార్ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వయో పరిమితి 34 నుంచి 36 ఏళ్ల వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వయో పిరిమితి పెంపు నుంచి పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖలకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది.




