నిరుద్యోగులను అడుగడుగునా మోసం చేస్తున్న ప్రభుత్వం

-ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఏమైందో చెప్పాలి
-బీఎస్పీ మండల అధ్యక్షులు అజ్మీరా వెంకన్న

మహబూబాబాద్ బ్యూరో-జూలై (జనంసాక్షి)

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులను అడుగడుగునా ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందని బహుజన్ సమాజ్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు అజ్మీరా వెంకన్న అన్నారు. బుధవారం గార్ల మండలంలోని నిరుద్యోగులు ప్రారంభించిన బ్రదర్స్ కేఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్న కేసీఆర్ మాయమాటలు నమ్మకుండా స్వతహాగా నిరుద్యోగులు వ్యాపారాలు ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. గద్దెనెక్కేందుకే ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇస్తానంటూ మోసం చేసి గద్దెనెక్కి ఎంతోమంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నదని, సొంతింటి స్వలాబాల మోజులో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను ప్రజాశ్రేయస్సును మరిచారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను గుర్తించి ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తూ జీవితాలను వృధా చేసుకోకుండా స్వతహాగా వ్యాపారాలు పెట్టుకుంటూ నిరుద్యోగులకు ఆదర్శంగా నిలిచిన యువతను ప్రోత్సహించాలని కోరారు.