నిరుద్యోగుల ఉసురు కల్వకుంట్ల కుటుంబానికి తగులక తప్పదు.నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే.టిడిపి మాజీ జిల్లా అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి18(జనంసాక్షి):
ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేననితెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి రమేష్ కొప్పుల రాష్ట్ర ప్రభుత్వం పై మండిపడ్డారు.శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్లకు చెందిన నవీన్ తనకు ప్రభుత్వ ఉద్యోగం రాదని మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఈ హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు.ప్రశ్నాపత్రాలు లికేజీకి బాధ్యత వహించి టిఎస్ పిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని, లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.నవీన్ ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని అన్నారు. ఉద్యగాలు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకుని విద్యార్థుల తల్లిదండ్రులు వారి ఆస్తులు తాకట్టు పెట్టి పొలాలు అమ్ముకొని వారి పిల్లలకు కోచింగ్ లు ఇప్పిస్తుంటే కొందరు వ్యక్తులు పేపర్ లీకేజ్ కి పాల్పడడం ఎంతవరకు న్యాయం అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయన్న కెసిఆర్ ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు కల్పించక చాలామందికి అర్హత వయస్సు కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పి కేసిఆర్ కుటుంబం మాత్రమే రాజకీయ ఉద్యోగాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగులను తెలంగాణ బిడ్డలకు లక్షల ఉద్యోగాలు ఇచ్చినమని తెలంగాణ యువత మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా వచ్చి తెలంగాణలోని ఉపాధి పొందుతున్నారని బీరాలు పలికే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో ఈరోజు ఉద్యోగం లేక ఉపాధి కరువై ఎట్లా బతకాలో తెలువక ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నడాని,దీనికి కేటిఆర్ ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.పేపర్ లీకేజీల వ్యవహారంలో బీఆర్ఎస్ మంత్రుల పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత వల్లనే పేపర్ లికేజ్ అయ్యిందని మండిపడ్డారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల ఉసురు కల్వకుంట్ల ఫ్యామిలీకి తప్పక తగులుతుందని దుయ్యబట్టారు.రాష్ట్ర ప్రభుత్వం బర్తరఫ్ అయితే నే ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులకు అసలైన ఆత్మశాంతి కలుగుతుందని అన్నారు. నిరుద్యోగుల పక్షాన తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాటాలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా సహాయక కార్యదర్శి డి బాలకృష్ణ మాజీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి జాఫర్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాము జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ నాగరాజు శివ తదితరులు పాల్గొన్నారు.




