నిరుద్యోగ సమస్య పోవాలంటే బిజెపికే సాధ్యం
వేములవాడ గ్రామీణం, నవంబర్ 17 (జనంసాక్షి): రాష్ట్రంలో యువత ఉపాధి లేక మత్తుకు బానిస అయ్యారని, నిరుద్యోగ సమస్య తీరాలంటే బిజెపికే సాధ్యమని వేములవాడ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు పేర్కొన్నారు. వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హనుమాజీపేట్, మల్లారం, జయవరం గ్రామాలలో శుక్రవారం ఆయన పార్టీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. దేశంలో సామాజిక న్యాయం చేసే ఒకే ఒక పార్టీ బిజెపి అని ఆయన పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడిన మోడీ ప్రభుత్వం కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి కృతజ్ఞత తెలపాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆయన వెంట బిజెపి గ్రామీణ అధ్యక్షుడు జక్కుల తిరుపతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.