జనం సాక్షి ప్రతినిధి మెదక్
పాపన్నపేట యూసుఫ్ పెట్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఒక మహిళా శనివారం చనిపోవడం జరిగింది. అంత్యక్రియలకు సైతం డబ్బు లేకపోవడంతో ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దాసయ్య,ఎంపీటీసీ జ్యోతి సాయిలు పాపన్నపేట మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు స్థానిక మెదక్ ఎమ్మెల్యే శ్రీమతి యం. పద్మా దేవేందర్ రెడ్డి గారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని వివరించగా తక్షణమే స్పందించిన మెదక్ శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి గారు అంత్యక్రియలకు రూ. 10,000/- ఆర్థిక సహాయం సహాయంను ఎంపీటీసీ జ్యోతి సాయిలు ద్వారా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా యూసుఫ్ పెట్ గ్రామం తరపున ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపిన సర్పంచ్ దాసయ్య, ఎంపీటీసీ జ్యోతి సాయిలు గ్రామస్థులు నాయకులు తదితరులు.
నిరుపేదకు ఆర్థిక సాయంతో చేయూత ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి




