నిరుపేదలకు అండగా నిఖిల్ రెడ్డి..
బాధితులకు నేనున్నానంటూ భరోసా.
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, సెప్టెంబర్ 22 (జనంసాక్షి):
ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అంకురి బాలయ్య(65) అనారోగ్యంతో బాధపడుతు గురువారం మృతి చెందాడు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి స్థానిక నాయకుల ద్వారా ఐదు వేల రూపాయలు అందించారు. స్థానిక నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంతో పాటు గ్రామంలోని బాధితులకు అండగా ఉంటున్న నిఖిల్ రెడ్డికి మండల ప్రజలు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీ ఎన్ ఆర్ యువసేన సభ్యులు శేరిబాబా, గణేష్, శ్రీను, సూరి గౌడ్, కృష్ణయ్య గౌడ్ తదతరులు ఉన్నారు.