నిరుపేదల ఆరోగ్యానికి అండగా హరీష్ రావు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చోరువతో పేద ప్రజల ఆరోగ్యశ్రీ కి 5 లక్షలకు పెంపు

వీణవంక జూలై 19 (జనం సాక్షి) రాష్ట్రంలో పేద ప్రజలు ఆరోగ్యానికి దూరం కావద్దని ఆరోగ్య తెలంగా కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణలో భాగంగా రాష్ట్రంలో వైద్య రంగ అభివృద్ధి కోసం ఆరోగ్యశ్రీ పథకం కింద 1038 పైగా జబ్బులకు ఉచితంగా సేవలు పేద ప్రజలకు అందాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా నిరుపేదలకు వైద్యం అందే దిశగా ఆరోగ్యశ్రీకి ఐదు లక్షల పెంపుకు నిర్ణయాన్ని తీసుకోవడం స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమను చూపెడుతూ మెడికల్ కాలేజీల,నర్సింగ్ కాలేజీల విషయంలో తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా చైతన్యవంతులై సాధించిన స్వరాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వానికి కాళ్లల్లో కట్టెల ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రజల బాగు కోరే ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు