గుండె సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి మంత్రి వేముల భరోసా
1.50 లక్షల రూపాయల ఎల్వోసి అందజేసిన మంత్రి
హైదరాబాద్ (జనం సాక్షి ) :
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం పురానిపేట గ్రామానికి చెందిన బి.రామకృష్ణ గుండె
సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కొరకు 1.50 లక్ష రూపాయల ఎల్వొసి మంజూరు చేయించి…ఎల్ఓసి కాపీ ని కుటుంబ సభ్యులకు మంత్రి బుధవారం నాడు హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 1లక్ష 50వేల రూపాయల ఎల్ఓసి మంత్రి గారు మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి గారి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.