నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్

115 మంది లబ్ధిదారులకు చెక్ లను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి  ద్వారా భరోసా కల్పిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గంలో మంజూరైన 55,29,500 రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ లను 115 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందన్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ ప‌్రభుత్వం సీఎం సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని చెప్పారు.సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వాలలో కూడా సీఎం సహాయనిధి ఉండేదని, ఆపదలో ఉన్న అందరికీ అందేది కాదని అన్నారు.తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ చొరవతో పార్టీలకు అతీతంగా , పైరవీలకు తావు లేకుండా ,ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ కింద చెక్ లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వపరంగా అన్ని పథకాలు అందుతున్నాయని అన్నారు.సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు అందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ , జిల్లా గ్రంధాలయ చైర్మన్  నిమ్మల శ్రీనివాస్ గౌడ్,  టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వైవి, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారయణ, పట్టణ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి  బూర బాల సైదులు గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు చాంద్ పాషా,సూర్యాపేట జడ్పీటిసి జీడిబిక్షం,ఎంపిపి రవీందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, చివ్వెంల మండల ఎంపిపి కుమారి బాబు నాయక్, జడ్పీటిసి సంజీవ నాయక్, మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, పెన్ పహాడ్ జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, ఆత్మకూర్ (ఎస్) మండల  ఎంపిపి మర్ల స్వర్ణలతా చంద్రా రెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహ రావు ,పట్టణ కౌన్సిలర్లు  గండూరి పావని కృపాకర్, బాషా, రాపర్తి శ్రీనివాస్, అనంతుల యాదగిరి, లక్ష్మి మకట్ లాల్, రవి, లింగా నాయక్, ఎలిమినేటి అభినయ్, రంగినేని లక్ష్మణ్ రావు , జీవి రావు,  కడారి సతీష్ యాదవ్, ముదిరెడ్డి సంతోష్ రెడ్డి, కిరణ్, బొమ్మిడి అశోక్, కరుణశ్రీ, దండు రేణుక, అంజమ్మ, విజయ,ఆయా గ్రామాల సర్పంచ్ లు ,ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు