బ్రహ్మోత్సవ ఆహ్వాన కర పత్రిక ఆవిష్కరణ.
మల్కాజిగిరి.జనంసాక్షి.జులై
ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతకు ఆలయాలే నిదర్శనమని మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆనంద్ బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల కర పత్రికను ఆవిష్కరించారు.అనంతరం వారు మాట్లాడుతూ.భక్తి శ్రద్ధలతో చక్కగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఆలయ కార్యిర్వహణాధికారి ఎబి రవీంద్రరెడ్డి,ఆలయ ప్రధానార్చకులు ముడుంబై వేంకట రమణా చార్యులు,అర్చకులు తులసి వెంకట రమణా చార్యులు, ,ఆలయ మాజీ చైర్మన్ రాందాస్ సంతోష్ ముదిరాజ్,ధర్మ కర్తలు గణేష్ ,రవీందర్,రత్నాకర్ ఆలాపన తదితరులు పాల్గొన్నారు.
Attachments area