నిరుపేద కుటుంబానికి ఆర్థిక చేయూత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 14 (జనంసాక్షి) ఆత్మకూర్ మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం పాషా గారి పూరిగుడిసె లో గ్యాస్ సిలిండర్ లీకై గుడిసెలో ఉన్న కట్టు బట్టలతో సహా అన్ని వస్తువులు కాలిపోవడం జరిగింది సలీం పాషా పేద కుటుంబానికి చెందిన వారైనందున వారికి ఆత్మకూరు మండల ముస్లిం మైనార్టీ కమిటీ తరపున పదివేల రూపాయలు హార్దిక సహాయం అందించడం జరిగింది ఈపేద కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని మండల ముస్లిం మైనార్టీ కమిటీ తరపున డిమైండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి యూసుఫ్ గారు జిల్లా మైనార్టీ సంక్షేమ అభివృద్ధి కమిటీ మెంబర్ ఎండి మౌలానా గారు మండల మైనార్టీ నాయకులు ఎండి అజీముద్దీన్ మైనార్టీ యువజన విభాగం నాయకులు ఎండి షఫీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు