నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

గరిడేపల్లి, అక్టోబర్ 16 (జనం సాక్షి): సమాజంలో ఉన్న పేద వర్గాలను ఆపద సమయంలో అదుకొని వారికి మనోధైర్యం కల్పించాలని తెరాస గ్రామ పార్టీ  అధ్యక్షులు చామకూరి అంజి గౌడ్ అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండలంలోని పోనుగోడు గ్రామంలో 2005 – 2006 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి మిత్రులందరూ కలిసి వారి తోటి స్నేహితుడు మద్దె మడుగు అరవింద్ వాళ్ళ అన్న అనారోగ్య కారణంతో చనిపోవడంతో చామకూరి అంజి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 4000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కానుగు గురుస్వామి,బండి నాగయ్య, షేక్ పాష, చిర్రా శ్రవణ్, అలుగుబెల్లి సందీప్ రెడ్డి,గొట్టిపర్తి వెంకటేశ్వర్లు, బత్తిని విజయ్ కుమార్, నందిపాటి శ్రీను,నందిపాటి మట్టయ్య ,మల్లికంటి ఉపేందర్,తదితరులు పాల్గొన్నారు.