నిరుపేద కుటుంబానికి ఎల్ఓసీ కొండంత అండ

టీఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 18 : నిరుపేద కుటుంబానికి ఎల్ఓసీ కొండంత అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ అన్నారు. చేర్యాల పట్టణానికి చెందిన డ్రైవర్ ఎండి.నజీర్ పక్షవాతం మరియు బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా వారి కుటుంబం పేద కుటుంబం కావడంతో వారి బంధువులు టీఅర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపూరి కిరణ్ కుమార్ ను సంప్రదించి విషయం తెలుపగా వెంటనే స్పందించిన కిరణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా లక్ష యబ్భై వేల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేశారు. ఆ ఎల్ఓసీ పత్రాన్ని బాధిత కుటుంబానికి మంగళవారం నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ వారికి అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ కు వారి కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెంట్ హౌస్ బాబు, రజాక్, ఉదయ్ కుమార్, ఇర్షద్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area