మానవ హక్కులకు భంగం కలిగితే జోక్యం చేసుకుంటాం

 రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్ 18:: మానవ హక్కులకు భంగం కలిగితే అతని హక్కుకు న్యాయం చేయడానికి మానవ హక్కుల సంఘం అండగా ఉంటుందని రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ చంద్రయ్య పేర్కొన్నారు తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆయన రైతులకు చేస్తున్న సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు మానవ హక్కులకు ఏ ఒక్క ప్రభుత్వ శాఖ నుంచి అయినా భంగం కలిగించే విధంగా వ్యవహరించినచో తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని వారికి న్యాయం చేస్తానని ఆయన తెలిపారు తూప్రాన్లు రామాలయం వద్ద ఇద్దరు అనాధలను  గుర్తించి వారికి ఆధార్ కార్డు పెన్షన్ వస్తున్న ఉండడానికి ఇంటి సౌకర్యం లేకపోవడంతో అనాధ శరణాలయం వారు వారిని ఆదుకోవడానికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అమర్ సింగ్ రైతులకు ఏ విధంగా సేవలు చేస్తున్నది రూముల పట్ల ఏ విధంగా ఎవరు వస్తున్నది వారి సేవలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు మొదటగా ఆయన ఆసుపత్రులలోని డెలివరీ అయిన పేషంటును వారి తల్లిదండ్రులను బంధువులను అడిగి చర్యని వైద్యం అందిస్తుండగా ఆపరేషన్ల పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆసుపత్రిలో పర్యటించి ఇది ప్రభుత్వ ఆసుపత్రిలో లేదని ప్రైవేటు ఆసుపత్రి కన్నా అందంగా ఉందని డాక్టర్లు కూడా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు ఒక్కో డాక్టర్ను వారు పనిచేస్తున్న తీరును వారి సమస్యలు లోపాలను అడిగి తెలుసుకున్నారు సిబ్బంది ఖాళీల వివరాలను వెంటనే తనకు తెలుపాలని డాక్టర్ అమర్ సింగ్ ను ఆయన ఆదేశించారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనితీరును ఆర్డీవో సాయికుమార్ ను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో సరైన టైంలో మందులు చికిత్సలు అందిస్తున్నారా అని అడగగా తమ ఆసుపత్రిలో సిబ్బంది ఖాళీలు ఉన్నారని డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన పంపించామని రక్తం స్టోరేజ్ సెంటర్ మంజూర  మార్చురీకి ఫ్రిడ్జ్ బాక్స్ కు ప్రతిపాదన పంపించామని తెలిపారు

తాజావార్తలు