నిరుపేద కుటుంబానికి 2.50 వేల ఎల్.ఓ.సి అందజేత.
ఎం.పి కొత్త ప్రభాకర్ రెడ్డి.
దుబ్బాక 30 సెప్టెంబర్ ( జనం సాక్షి )
దుబ్బాక మండలం గంభీర్ పూర్ గ్రామానికి చెందిన కిష్ట గారి దుర్గారెడ్డి గత 20 రోజులుగా అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో బాధపడుతున్నాడు.ఈ విషయం గ్రామ సర్పంచ్ కరికే భాస్కర్ మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే స్పందించి మెరుగైన వైద్యం కొరకు శుక్రవారం నాడు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పోతారం గ్రామంలోని తన నివాసంలో 2.50 రెండు లక్షల వేలు రూపాయలఎల్.ఓ.సి ని వారి కుటుంబ సభ్యులు యాదిరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కడతాల రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కరికే భాస్కర్, సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి, సాగర్ రెడ్డి, కృష్ణంరాజు, తదితరులు ఉన్నారు.
Attachments area