హైదరాబాద్: జైళ్ల శాఖపై ఆరోపణలను నిరూపిస్తే రూ.5 వేలు బహుమతిగా ఇస్తామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జైళ్ల శాఖపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరోపణలు రుజువు చేస్తే బహుమతి ఇస్తానన్నారు. ఖైదీలతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేయించి, వాటిని గ్రామాల్లో విక్రయించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 2025 నాటికి జైళ్ల శాఖ ద్వారా 5 వేల కోట్లు వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. త్వరలో 100 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తామన్నాని వీకే సింగ్ తెలిపారు. జైళ్లశాఖలో వచ్చిన మార్పులపై అధ్యయనం చేయాలని దేశంలోని మేనేజ్‌మెంట్ సంస్థలకు లేఖలు రాశామని కూడా ఆయన తెలిపారు.




