నిర్మల్ జిల్లా బైంసా డివిజన్ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు
భైంసా రూరల్ జనం సాక్షి ఆగస్టు15
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకోవడం మన అందరి బాధ్యతన్నారు. జెండా పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రధాన వీధులలో నినాదాలు చేస్తూ ప్రభాతభేరి నిర్వహించారు.భైంసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్,ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ రాజేష్ బాబు,బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఫారుక్,ప్రభుత్వ ప్రైవేటు ,కార్యాలయాల్లో గ్రామాల్లో జాతీయ జెండాను ఎగుర వేసి వందనం చేశారు. ఈ వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, అధికారులు,ఉద్యోగులు, వ్యాపారులు,ప్రజలు పాల్గొన్నారు