Tuesday, 3 November 2026

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

భైంసా రూరల్ మార్చ్04 జనం సాక్షి  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జివో 58 లో 9 పట్టాలు మిగిలాయని వారు రేపు సాయంత్రం వరకు తీసుకెళ్లాలని లేదంటే కలెక్టర్ కార్యాలయంలో అప్పగించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు జివో 59 లో 90 దరఖాస్తులు వచ్చాయని భైంసా పట్టణానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు జివో 59 దరఖాస్తు చేసుకున్న వారికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది వీలైనంత త్వరగా వారికి పర్మిషన్ ఇస్తామని తెలిపారు వీరు ఎప్పుడైనా అమ్ముకోవడానికి వీలుంటుందన్నారు అక్రమ ఇసుకను కట్టడి చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రణాళిక రూపొందించారని ఒక్కో ట్రాక్టర్ కు 800 రూపాయల డిడి చెల్లించి ఇసుకను తీసుకెళ్లాలని తెలిపారు ఇసుక కోసం ఒకరోజు ముందుగా అప్లికేషన్ చేసుకుంటే 24 గంటల్లో పర్మిషన్ ఇస్తామని తెలిపిన తాసిల్దార్ పర్మిషన్ లేకుండా ఇసుకను తరలిస్తే 5000 నుండి 15 వేల వరకు జరిమానా విధిస్తామని  తాసిల్దార్ అన్నారు