నివాసాలు కోల్పోతున్న ప్రాంతాల గుర్తింపు

నాచారం(జనంసాక్షి):  మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లాపూర్ క్రాస్ రోడ్స్ నుండి మల్లాపూర్ ఐలా వరకు రోడ్డు వెడల్పు కొరకు గతంలో 244 గృహాలను గుర్తించి నారు, రోడ్డు వెడల్పులో నివాసలను కోల్పోతున్న ప్రాంతాలు ఓల్డ్ మల్లాపూర్, నాగలక్ష్మి నగర్, బ్రహ్మపురి కాలనీ, గ్రీన్ హిల్స్ కాలనీలు, వరంగల్ హైవే రహదారి వరకు జీహెచ్ఎంసి సిసిపి దేవేందర్ రెడ్డి కు  చూపించిన స్థానిక కార్పొరేటర్, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి . ఇట్టి రోడ్డు వెడల్పు వలన చాలా ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులు తొలగుతాయని ప్రధానంగా ఓల్డ్ మల్లాపూర్ లోని బీరప్పగడ్డ ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉండడం వలన వాహన దారులు, స్థానికులకు రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కావున బీరప్పగడ్డ ప్రాంతంలో త్వరితగతిన పనులు ప్రారంభించాలని కోరుతూ, ఇట్టి రోడ్డు వెడల్పు కొరకు తగిన చొరవ చూపిస్తూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ప్రభుత్వం తరపున తగిన నష్ట పరిహారం త్వరతగతిన  ఇప్పించాలని  కోరారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు శేఖర్ రెడ్డి,  శ్రీధర్ ప్రసాద్, సరితా తదితరులు పాల్గొన్నారు.