*ప్రత్యర్థుల పై నిప్పులు చెరిగిన సండ్ర
పెనుబల్లి, మార్చ్ (జనం సాక్షి) నీకు దమ్ము, ధైర్యం ఉందనుకుంటే సత్తుపల్లి నియోజక వర్గంలో నాపై పోటీ చేయాలని, నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య పిడమర్తి రవి పై సవాలు విసిరారు,బుదవారం పెనుబల్లి మండలం లో పర్యటించిన సందర్భం గా గంగాదేవి పాడులో కల్యాణి లక్ష్మి చెక్కుల పంపిణీ అనంత రం జరిగిన విలేకర్ల సమావేశంలో సండ్రమా ట్లాడారు, నేను విధాన పరంగా విమర్శిస్తే నా పై చాలా మంది, చాలా విధాలుగా వ్యక్తి గత విమర్శలు చేస్తున్నారని అన్నారు, సత్తుపల్లి లో పోటీ చేసి ఓడి పోయి ప్రజలను, సత్తుపల్లిని వదిలి పారీ పోయావని ఎద్దేవా చేశారు, నీకు ఓటు వేసే ప్రజల నాడిని కనిపెట్ట లేక పోయావని అన్నారు, నీ మూర్ఖత్వం చర్యలవలన ప్రజలకు సేవ చేయలేక పోయా వని, ప్రజలకు అందుబాటులో వుండ లేక పోయా వని అన్నారు,
సత్తుపల్లి వీధులలో నిక్కర్ల తో బారుషాపుల వెంట మందు తాగుతూ తిరిగే అలవాటు నీదని అన్నారు,బారుషాపు లు, కోడి పందాల నిర్వహణ నీ వెనక వున్నవారికి అలవాటని అన్నారు, నీ పక్కన కూర్చు న్న వారీ జాతకాలు తెలుసన్నారు, ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మన కేసి ఆర్ ప్రభుత్వ మన్నారు, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయ లోపంవలన సాగర్ జలాలు సకాలంలో అందక పంట పొలాలు ఎండి పోతుంటే నీటి పారుదల శాఖ చీప్ ఇంజనీర్, అధికారుల ను డైరెక్ట్ గా పంట పొలాల కు తీసుకు వచ్చిన ప్రభుత్వం మా బి ఆర్ ఎస్ ప్రభుత్వ మన్నారు, రైతుల కష్టాల ను దృష్టిలో పెట్టుకొని, ఇరిగేషన్ అధికారుల ను సమన్వయ పరిచి ఇరవై నాలుగు గంటల లో సాగర్ జలాలను రప్పించి ఎండిన పొలాలకు పంపి స్తున్నామన్నారు, పది హేను రోజుల పాటు సాగర్ జలాలను వార బందీ లేకుండా వచ్చే విధంగా చర్యలు తీసుకు న్నామన్నారు. కార్యక్రమం లో సర్పంచ్ కనగాల జయలక్ష్మీ, జెడ్ పి టి సి చెక్కిలాల మోహనరావు, మండల పార్టీ అధ్యక్షుడు కనగాల వెంకటరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణరావు, ఎం పి టి సి కనగాల సురేష్ బాబు, నీలాద్రి దేవస్తానం కమిటి ఛైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, ఆచంటి శ్రీనివాసరావు, కోమటి వెంకటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.




