Wednesday, 4 November 2026

నీటి సమస్యను పరిష్కరించి కౌన్సిలర్‌æచిట్టిబాబు సత్యనారాయణ

 

 

 

 

 

 

 

 

జనం సాక్షిజోగిపేట ఆందోల్ జోగిపేట పట్టణంలోని 17 వవార్డు పరిధిలోని పెద్ద మఠం వద్ద చెడిపోయిన మోటారు చెడిపోవడంతో వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో వార్డు కౌన్సిలర్‌ చిట్టిబాబు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించారు. గత నాలుగు రోజులుగా బోరు మోటారు చెడిపోవడంతో కౌన్సిలర్‌ చిట్టిబాబు నీటి సమస్యను తీర్చేందుకు కొత్త మోటారును ఏర్పాటు చేయించారు. మోటారు కొనుగోలు కోసం ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా ఏర్పాటు చేయించడంతో వార్డు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వార్డులో నీటి ఇబ్బందులు తీర్చినందుకుగాను కౌన్సిలర్‌ను అభినందించారు. ముదిరాజ్‌ సంఘం మాజీ అధ్యక్షుడు జట్టు విఠల్, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్, నాయకుడు పాండురంగం, రజక సంఘం నాయకుడు జోగయ్య, కాలనీకి చెందిన అయ్యప్ప రాజేష్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జోగిపేటలో బోరును రిపేరు చేయిస్తున్న వార్డు కౌన్సిలర్‌ చిట్టిబాబు.