నీట మునిగిన విద్యానగర్ వాసులకు ఆహారం అందజేత
వరంగల్ ఈస్ట్, జులై 26 (జనం సాక్షి)ఎడతెరిపి లేకుండా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ విద్యానగర్ ,కాష్కుంట ప్రాంతాల్లోని గృహవాసులు వరద నీటిలో ముంపుకు గురి కావడంతో 39 వ డివిజన్ నాయకులు షేర్ల కిషోర్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ఆహారం అందించడం జరుగుతుంది ఈ క్రమంలో బుధవారం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కూడా ఆయా ప్రాంతాలను సందర్శించారు. తీవ్ర వరద నీటిలో మునిగి ఉన్న గృహవాసులను కలిసి ధైర్యం చెప్పారు గృహవాసులకు ఆహార పదార్థాలు అందిస్తూ ఎంతో ధైర్యాన్ని ఇచ్చిన కాంగ్రెస్ నాయకుడు షేర్ల కిషోర్ ను ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు అభినందించారు. అదేవిధంగా నీట మునిగిన గృహవాసులు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రాంతి, భాస్కర్, విక్రం, విజయ్, పవన్, రాజు, కిరణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.