Tuesday, 3 November 2026

నీలం తుఫాన్‌ ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి సమీక్ష

‘నీలం’ ప్రభావం 25 మంది మృతి
5.25 హెక్టార్లలో పంట నష్టం
వందకు పైగా పశువులు మృతి
మరో 24 గంటలు భారీ వర్షాలు
హైదరాబాద్‌,నవంబర్‌ 5: (జనంసాక్షి)
రాష్రంలో నీలం తుఫాను ప్రభావంతో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందినట్టు విపత్తు నిర్వహణశాఖ మంత్రి రఘవీరా రెడ్డి తెలిపారు.తుఫాను వల్ల 5.25 లక్షల హెక్టార్లలో వరి,ఇతర పంటలు నీటమునిగినట్లు చెప్పారు.వందకుపైగా పశువులు మృతి చెందాయన్నారు.వర్షానికి 1000 కి.మీ మేర రోడ్డు, 2 వేల ఇల్లు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని మంత్రి తెలిపారు.
నీలం తుఫాన్‌  ప్రభావంపై మంత్రి రఘువీరారెడ్డి ఉన్నతాదికారులతో సచివాలయంలో సోమవారం సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ,శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలో రానున్న 24  గంటల్లో భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉన్నట్టు మంత్రి తెలియజేశారు.అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ వరద బాదితులను ఆదుకొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అదికారులను ఆదేశించినట్టు చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో నష్టం  అంచనాపై ఎప్పటికప్పు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించాల్సిందిగా అదికారులకు మంత్రి సూచించారు.ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *