హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో ఐఆర్‌ఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డికి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. వాన్‌పిక్ కుట్రలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మానందరెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. దర్యాప్తు ఇంకా కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని సీబీఐ కోరింది, ఈ రాష్ట్రంలో కేవలం డిప్యూటేషన్‌పై కొన్నాళ్లే పనిచేశానని, మరో రాష్ట్రంలో రైల్వే అధికారిగా ఉన్న తాను సాక్ష్యాలు ఎలా తారుమారు చేయగలుగుతానని బ్రహ్మానందరెడ్డి వాదించారు. వాన్‌పిక్ వ్యవహారంలో ఓ మంత్రి, ఇద్దరు ఐఏఎస్‌లు బయటే ఉన్నారని పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ గోవిందరాజులు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.




